|  
● FLASH NEWS
HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  • 
Skip to content

Ishan Kishan on Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. టీమిండియా సీనియర్లు ఏం చేస్తున్నారో తెలుసా?

Sports Desk, Surya News: ​భారత యువ సంచలనం (Vaibhav Sooryavanshi) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్, రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్ వల్ల ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టులోని సీనియర్ ఆటగాళ్లు (Senior Players) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వికెట్ కీపర్ బ్యాటర్ (Ishan Kishan) వెల్లడించాడు.

​రెండో టీ20 (T20 Match) పోరులో 44 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player of the Match) అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైభవ్ గురించి పలు కీలక విషయాలు పంచుకున్నాడు. వైభవ్ చాలా తెలివైన ఆటగాడని, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానంలో ఎలా ప్రవర్తించాలో, మైదానం బయట ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసని పేర్కొన్నాడు. అయితే అతను వచ్చిన నేపథ్యం కారణంగా చుట్టూ ఎన్నో ఆకర్షణలు, దృష్టి మళ్లించే అంశాలు ఉంటాయని, తాను కూడా అదే పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి వాటి ప్రభావం ఎలా ఉంటుందో తనకు తెలుసని ఇషాన్ తెలిపాడు.

​వైభవ్ సోషల్ మీడియా (Social Media), బయట జరుగుతున్న ప్రచారం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండేలా భారత జట్టు (Team India) ప్రయత్నిస్తోందని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. తాను మాత్రమే కాకుండా అభిషేక్ శర్మ (Abhishek Sharma), అక్షర్ పటేల్ (Axar Patel) తో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు కూడా వైభవ్‌తో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని చెబుతున్నామని అన్నాడు. ప్రస్తుతం అతను పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని, బయట ఎవరు ఏమంటున్నారు అనే విషయాలు పట్టించుకోవద్దని సూచిస్తున్నామని పేర్కొన్నాడు. ఒకవేళ పరుగులు చేయకపోయినా నిరాశ చెందకుండా ఉండాలని ఎప్పుడూ చెబుతుంటామని వివరించాడు.

​వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని ఇషాన్ కిషన్ కొనియాడాడు. వైభవ్ లాంటి బ్యాటర్ పవర్ ప్లే (Powerplay) సమయంలో క్రీజులో ఉంటే తొలి ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 నుంచి 90 పరుగులకు చేరుతుందని తెలిపాడు. అలాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు చిన్న వయసులోనే తప్పుదారి పట్టకూడదని, అందుకే మేమంతా అతనికి అన్నల్లా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నాడు. కెరీర్ ప్రారంభంలో తాము చేసిన తప్పులను అతను చేయకుండా చూసుకోవడమే తమ బాధ్యత అని, మానసికంగా శారీరకంగా సరైన దారిలో ముందుకు వెళ్లేలా సహాయం చేస్తున్నామని చెప్పాడు. వైభవ్ ఎప్పుడూ సంతోషంగా క్రికెట్ ఆడుతూ తన ఆటను ఆస్వాదించాలని కోరుకుంటున్నామని ఇషాన్ వివరించాడు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp