|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

HYDRA Jobs 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రాతపరీక్ష లేకుండానే హైడ్రాలో ఉద్యోగాలు

​హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి మొత్తం 150 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల్లో 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ (DRF Assistant) పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ (Heavy Vehicle Driver) పోస్టులు ఉన్నాయి. పదో తరగతి (10th Class) ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు. డ్రైవర్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు విధిగా ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కలిగి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

​ఈ హైడ్రా ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష (Written Exam) ఉండదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా ఫిజికల్ ఈవెంట్స్ (Physical Tests) ఆధారంగానే చేపట్టనున్నారు. 800 మీటర్ల పరుగు పందెమును 2 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 100 మీటర్ల పరుగు పందెమును 15 సెకన్లలో పూర్తి చేయాలి. 4 మీటర్ల దూరం లాంగ్ జంప్ (Long Jump) దూకాలి. అలాగే 7.2 కేజీల షాట్ పుట్ ను 6 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.

​ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత, ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 8వ తేదీ, 9వ తేదీల్లో ఎంపికకు హాజరుకావాలి. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియం (Saroornagar Stadium) లో నేరుగా హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సెలక్షన్‌ను హాజరు అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు తీసుకురావాలి. వాటితో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp