
మర్రిగూడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను మర్రిగూడ మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పందుల రాములు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల వంటి ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిపై నిలదీస్తున్న బీజేపీ నాయకులపై దాడులకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటే ఏమి చేయాలో పాలుపోకనే కాంగ్రెస్ గుండాలను ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు వెనపల్లి శ్రీనివాసరావు, అంబాల రమేష్, జింకల లింగస్వామి, మామిడి కమలాకర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



