
హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA) సంస్థకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ (A.V. Ranganath) ను పదవి నుంచి తొలగించాలంటూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేసింది.
అప్పీల్‌పై విచారణ
హైడ్రా పరిధిలో చేపడుతున్న కూల్చివేతలు, అధికారాల వినియోగం, అలాగే కమిషనర్ నియామకానికి సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. రంగనాథ్ పదవిపై కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను తాజాగా విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధించింది. దీంతో ఆయన హైడ్రా కమిషనర్‌గా యథావిధిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
తదుపరి విచారణ కీలకం
నగరంలో నాలాలు, చెరువుల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. కమిషనర్ నియామక వివాదం సంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని పలువురు భావించారు. తాజా హైకోర్టు స్టే ఉత్తర్వులతో హైడ్రా పరిపాలనా వ్యవహారాల్లో ఏర్పడిన సందిగ్ధతకు తాత్కాలికంగా తెరపడినట్లైంది. కాగా, ఈ వ్యవహారంపై తదుపరి న్యాయపరమైన విచారణలో కోర్టు తీసుకునే తుది నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



