|   
🔴 BREAKING NEWS ► BRAOU and COL MoU : డిజిటల్ విద్యలో చారిత్రాత్మక ఘట్టం.. కెనడా సంస్థతో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కీలక ఒప్పందం Bhogapuram International Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం.. ఏపీ ముఖచిత్రం మార్చేయనున్న మెగా ప్రాజెక్ట్ ప్రారంభం IBPS Clerk Notification 2026 : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 11,403 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ AP Building Rules : భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం ఊరట.. బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త రూల్స్ ఇవే BRAOU Online Courses : డిజిటల్ యుగంలోకి అంబేద్కర్ వర్సిటీ.. 4 ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్
Skip to content

Telangana High Court : హైడ్రా దూకుడుకు హైకోర్టు బ్రేక్.. అర్ధరాత్రి కూల్చివేతలపై సంచలన తీర్పు.. పూర్తి వివరాలు

Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతలపై హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వ్యవహార శైలిపై న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి సోమవారం నాడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి కూల్చివేతలు (Demolitions) చేపట్టకూడదని స్పష్టం చేశారు. అయితే చెరువులు, మురుగు కాలువలు (Nalas), పార్కులు, పబ్లిక్ రోడ్లు, రివర్ బాడీలపై ఉన్న ఆక్రమణలను మాత్రమే తొలగించేందుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది.

ఇతర ప్రాంతాలైన ప్రైవేట్ భూములు (Private Lands), ఇంటర్నల్ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటి చోట ఎలాంటి అనధికార నిర్మాణాలు ఉన్నా వాటిని కూల్చవద్దని కోర్టు తేల్చి చెప్పింది. ముందుగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) లేదా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి కోర్టు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించింది. ఆ తర్వాతే తదుపరి చర్యలు (Action plan) ఉండాలని సూచించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ (Ameenpur) గ్రామంలో జరిగిన కూల్చివేతలపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ప్రధానంగా 98 ఏళ్ల వృద్ధుడు ఎం.ఏ. షరీఫ్ (M.A. Sharif) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు (Notices) లేకుండా వందల మంది సిబ్బంది, బుల్ డోజర్లతో వచ్చి వందేళ్ల నాటి తమ పూర్వీకుల ఇంటిని, ఇతర నిర్మాణాలను నేలమట్టం చేశారని సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి చర్యలు యుద్ధ వాతావరణాన్ని (War zone) తలపిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టడంపై హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఎ.వి. రంగనాథ్ బృందాన్ని కోర్టు తీవ్రంగా మందలించింది. ప్రజల ఆస్తులు కాపాడటంతో పాటు న్యాయపరమైన విధానాలు లేకుండా ఇష్టానుసారం చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది. హైకోర్టు తాజా ఆదేశాల కాపీ అందగానే యంత్రాలు, సిబ్బంది వెనుదిరగడంతో ఐలాపూర్ లో గత రెండు రోజులుగా జరుగుతున్న భారీ కూల్చివేతలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp