|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

BRAOU : ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రొఫెసర్ మేరీ సునంద.. అంబేద్కర్ వర్సిటీలో ఘన సన్మానం

braou prof mary sunanda felicitated best teacher
braou prof mary sunanda felicitated best teacher

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన డా. బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ (BRAOU) ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జి. మేరీ సునందను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. గురుపూజోత్సవం సందర్భంగా విద్యా రంగానికి ఆమె చేసిన విశేష సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ అవార్డును ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకురాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోవడం గర్వకారణమని ప్రశంసించారు. అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మేరీ సునంద స్పందిస్తూ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణా రెడ్డి, ప్రొఫెసర్లు డి. రబీంద్రనాథ్ సోలమన్, ఆనంద్ పవార్, పల్లవీ కాబ్దే, భోజు శ్రీనివాస్, పి. వెంకట రమణ, వడ్డాణం శ్రీనివాస్, మాధురి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, డాక్టర్ యకేశ్ దైద, కె. మంజుల తదితరులు ప్రొఫెసర్ మేరీ సునందను అభినందించి ఘనంగా సత్కరించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp