|   
🔴 BREAKING NEWS ► Youtuber Ravan Arrest : యూట్యూబర్ రావణ్ మళ్లీ అరెస్ట్.. ఐదోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు Vaibhav Sooryavanshi : సచిన్ 37 ఏళ్ల రికార్డు బ్రేక్.. అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు. కానీ..? TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ Food Adulteration in Hyderabad : మీరు తినేది అన్నమా? విషమా? 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహారం సీజ్, నగరంలో వణికిపోతున్న ఫుడ్ మాఫియా Save Telugu University : అక్షరాల గుడిలో ఆక్రమణల పర్వం.. వర్సిటీని కాపాడుకునేందుకు కదిలివచ్చిన విద్యార్థి, మేధావి లోకం!
Skip to content

BRAOU News : ఇన్నాళ్లకు జరిగిన అత్యుత్తమ పని.. అంబేడ్కర్ వర్సిటీలో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరణ

​హైదరాబాద్, సూర్య న్యూస్ : దూరవిద్య పితామహుడు మరియు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి. రాంరెడ్డి (Prof. G. Ram Reddy) విగ్రహాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Prof. Ghanta Chakrapani) ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు.

విద్యా వారోత్సవాలలో భాగంగా లీడర్ షిప్ కనెక్ట్ (Leadership Connect) పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దూరవిద్యా విధానాన్ని (Distance Education) దేశవ్యాప్తంగా విస్తరించేలా చేయడంలో రాంరెడ్డి కృషి ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాల (Open Universities) ఏర్పాటుకు ఆయనే మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేశారు. దేశ ఉన్నత విద్యా రంగంలో విశేష గుర్తింపు పొందిన ప్రొఫెసర్ రాంరెడ్డి విగ్రహాన్ని వర్సిటీలో ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని చక్రపాణి సంతోషం వ్యక్తం చేశారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

అనంతరం వర్సిటీలోని సీఎస్టీడీ (CSTD) భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఆర్.వి.ఆర్. చంద్రశేఖర్ రావు సినర్జీ హాల్ ను కూడా వైస్ ఛాన్స్ లర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ జి. హరగోపాల్ (Prof. G. Haragopal) కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రొఫెసర్ రాంరెడ్డి మూలకారణం అని ఆయన స్పష్టం చేశారు. విద్యా రంగానికి ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పద్మ అవార్డుతో (Padma Award) ఆయనను సత్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రొఫెసర్ రాంరెడ్డి ఒక గొప్ప దార్శనికుడు అని ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp