|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

BRAOU AI Training : ఉపాధ్యాయులకు సరికొత్త సాంకేతికత.. అంబేద్కర్‌ ఓపెన్ వర్సిటీలో 15 రోజుల ఉచిత శిక్షణ!

హైదరాబాద్, సూర్య న్యూస్: విద్యా రంగంలో మారుతున్న ఆధునిక సాంకేతికతను జోడించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Open University) శ్రీకారం చుట్టింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో వర్సిటీకి చెందిన ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్ (COEL) ఆధ్వర్యంలో ‘టీచర్ల కోసం ఏఐ’ (AI for Teachers) పేరుతో 15 రోజుల ప్రత్యేక ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళికల రూపకల్పన, కంటెంట్ క్రియేషన్, అసెస్‌మెంట్ల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులకు ప్రాక్టికల్ నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా అందించనున్నారు. మొదటి బ్యాచ్ కోసం ఇప్పటికే 1500 మందికి పైగా ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

​ఈ ఆన్‌లైన్ శిక్షణా తరగతులు 2026 ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవ సదస్సుకు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 7:00 నుండి రాత్రి 8:30 గంటల వరకు గంటన్నర పాటు ఈ సెషన్లు జరగనున్నాయి. ఏఐ సాధనాలు, ప్రాంప్టింగ్ టెక్నిక్స్, పరిశోధన, నైతిక విలువలతో కూడిన ఏఐ వినియోగం వంటి 15 కీలక అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp