
న్యూఢిల్లీ, సూర్య న్యూస్. ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఇటీవల విడుదల చేసిన ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను ప్రత్యేక భూభాగాలుగా చూపించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యను కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది.
పరిమాణం ఆధారంగా రూపొందించే ఈక్వల్ ఏరియా మ్యాప్స్ తీర్మానానికి మాత్రమే తాము ఓటు వేశామని, అంతమాత్రాన ఏ మ్యాప్‌నూ అధికారికంగా ఆమోదించినట్లు కాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లతో పాటు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని ఆయన తేల్చిచెప్పారు.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



