|  
FLASH NEWS
Jio Network Issue : సిగ్నల్ రావడం లేదని వినూత్న నిరసన.. టెలికాం ఉద్యోగిని ఏకంగా టవర్‌కే కట్టేసిన గ్రామస్తులు!  •  KTR Comments on Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌ వెనుక మంచిరేవుల భూకుంభకోణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు  •  BRICS Summit 2026 : ‘మంచివారితోనే స్నేహం.. చెడ్డవారితో వద్దు’.. బ్రిక్స్ వేళ మోదీ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి?  •  KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  • 
Skip to content

Irumudi Success Meet : నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిన మూవీ ‘ఇరుముడి’.. సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదే: రవితేజ

హైదరాబాద్, సూర్య న్యూస్ : హీరో రవితేజ (Ravi Teja) నటించిన ‘ఇరుముడి’ సినిమా (Irumudi Movie) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో రవితేజ మాట్లాడుతూ.. ఈ మూవీ తనకెంతో గర్వకారణమని, నటుడిగా తనకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

సినిమా గురించి ప్రేక్షకులు, అభిమానులు గొప్పగా చెబుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందని, మనసు పొంగిపోతోందని రవితేజ అన్నారు. తనకు నటుడిగా ఇంత మంచి పేరు రావడానికి, చిత్రం ఘన విజయం సాధించడానికి పూర్తి క్రెడిట్ దర్శకుడు శివ నిర్వాణదే అని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడి అంకితభావం వల్లే ఈ చిత్రం ఇంతటి భారీ సక్సెస్‌ను అందుకుందని ప్రశంసించారు.

మైత్రీ బ్యానర్‌కు కిరీటం లాంటిది

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సక్సెస్ వేడుకలో నిర్మాత రవి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తమ నిర్మాణ సంస్థ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించిందని, వాటన్నింటిలోనూ ‘ఇరుముడి’ తమ బ్యానర్‌కు ఒక కిరీటం లాంటిదని గర్వంగా చెప్పారు. హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp