|  
FLASH NEWS
Women’s Asia Cup 2026 : శ్రీలంకపై ప్రతీకారం.. ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా టీమిండియా  •  Konda Surekha : ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దల కబురు.. కొండా సురేఖకు మరో కీలక పదవి గ్యారెంటీనా?  •  BRICS Summit 2026 : భారత్‌లో బ్రిక్స్ సదస్సు సక్సెస్.. ప్రధాని మోదీ దౌత్యంపై విదేశీ మీడియా ప్రశంసలు  •  China Ocean Minerals : పసిఫిక్ సముద్ర గర్భంలో అపారమైన బంగారం, వెండి నిక్షేపాలు.. చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు  •  Artificial Paneer Ban : తెలంగాణలో పనీర్ ప్రియులకు షాక్.. కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం  • 
Skip to content

BRICS Summit 2026: పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిక్స్ దేశాలు.. ఉమ్మడి ప్రకటన విడుదల

Brics 2026
Brics 2026

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit 2026) వేదికగా సభ్య దేశాలు ఉగ్రవాదంపై గట్టి సందేశం ఇచ్చాయి. ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam) జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని, దాని ప్రేరణ, ప్రాంతం, కారణాలతో ఎలాంటి సంబంధం లేదని ‘ఢిల్లీ డిక్లరేషన్’ (Delhi Declaration) ద్వారా సభ్య దేశాలు స్పష్టం చేశాయి.

సరిహద్దు ఉగ్రవాదంతో పాటు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, వారికి స్థావరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను అరికట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఐక్యరాజ్యసమితి (UN) ఉగ్రవాదులుగా ప్రకటించిన వ్యక్తులు, సంస్థలపై సమిష్టిగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ్య దేశాలు తీర్మానించాయి. కాగా, ఈ సదస్సు సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్రిక్స్ నేతలంతా కలిసి మొక్కలు నాటారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp