
చేవెళ్ల, సూర్య న్యూస్ : చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంపై (Chevella STO Office) అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ ఫైల్ కోసం లక్ష రూపాయలు లంచం (Bribe) తీసుకుంటూ ఇద్దరు ఉన్నతాధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
వివరాల్లోకి వెళితే.. ఒక రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పెన్షన్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు ఏటీఓ అనురాధ, ఎస్‌టీఓ లక్ష్మయ్య లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది చిన్న అనే వ్యక్తి ద్వారా సదరు అధికారులు ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఏటీఓ, ఎస్‌టీఓలను ఏసీబీ బృందం వెంటనే అదుపులోకి తీసుకుంది. కార్యాలయంలోని పలు కీలక ఫైళ్లను పరిశీలించడంతో పాటు, నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



