|  
FLASH NEWS
Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  • 
Skip to content

Ganesh Nimarjjanam : పామూరులో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం.. పటిష్ట బందోబస్తు నడుమ కోలాహలం

పామూరు, సూర్య న్యూస్ : పామూరు మండలంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకల అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని (Ganesh Nimarjjanam) శుక్రవారం ప్రశాంతంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో డీజే మ్యూజిక్, సంప్రదాయ భజంత్రీల నడుమ భారీ ఎత్తున నిమజ్జన శోభాయాత్రను కొనసాగించారు.

నిమజ్జన ఉత్సవాల్లో యువతీయువకులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ వీధుల్లో డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, బాణసంచా కాల్చుతూ వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. బొట్లగూడూరు ప్రాంతానికి చెందిన వినాయక విగ్రహాలకు కూడా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం పూర్తి చేశారు.

శోభాయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సీఐ వినోద్ కుమార్, ఎస్ఐ కట్టా అనూక్ స్వయంగా బందోబస్తును పర్యవేక్షించి, నిమజ్జన ఘట్టం సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp