|  
FLASH NEWS
మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  •  Pawan Kalyan Health Update : ముగిసిన ఆయుర్వేద వైద్యం.. నెల రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన పవన్!  •  Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  • 
Skip to content

Radhika Apte : ఇన్నర్‌వేర్‌తో ఫైట్స్ చేయమన్నారు.. కెరీర్ తొలినాళ్లపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు

ముంబై, సూర్య న్యూస్ : ప్రముఖ నటి రాధికా ఆప్టే (Radhika Apte) తన సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో కథతో సంబంధం లేకుండా ఇన్నర్‌వేర్‌తో ఫైట్ సీన్స్ (Action Scenes) చేయాలని కొందరు బలవంతం చేసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల ఉండే వివక్ష, అకారణంగా బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి రావడం తదితర అంశాలపై బహిరంగంగా మాట్లాడారు.

న్యూడ్‌గా నటించడంతో ఆ ముద్ర పడిపోయింది

తన కెరీర్ ప్రారంభ దశలో సుమారు నాలుగు, ఐదు సినిమాల్లో న్యూడ్‌గా నటించాల్సి వచ్చిందని రాధికా ఆప్టే వెల్లడించారు. తాను అలా నటించడం చూసి, కథకు అవసరం లేకపోయినా ఎలాంటి ఇంటిమేట్ సన్నివేశాల్లోనైనా నటిస్తానని కొందరు ఇండస్ట్రీ వర్గాలు తప్పుగా భావించారని ఆమె విమర్శించారు. కనీసం ఎలాంటి సరైన కారణం లేదా సందర్భం లేకుండానే తోటి నటులను ముద్దు పెట్టుకోవాలని దర్శకులు తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది

కొన్ని సినిమాల్లో అయితే ఏకంగా బ్రా, అండర్‌వేర్ ధరించి యాక్షన్ సన్నివేశాలు చేయాలని తనను అడిగారని రాధిక తెలిపారు. అయితే గతం కంటే ఇప్పుడు సినిమా పరిశ్రమలో పరిస్థితులు కాస్త మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఏదైనా ఇంటిమేట్ లేదా బోల్డ్ సీన్ చేయాల్సి వస్తే, ఆ సన్నివేశం కథకు ఎందుకు అవసరమో స్పష్టంగా వివరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాధికా ఆప్టే చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp