|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

Regina: నచ్చకపోతే ముందే తప్పుకోవాలి.. నార్త్ హీరోయిన్లకు కౌంటర్

రెజీనా కసాండ్రా, రాధికా ఆప్టే

హైదరాబాద్, సూర్య న్యూస్ : దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటీమణులు జాన్వీ కపూర్, రాధికా ఆప్టే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కథ, పాత్రలు నచ్చని పక్షంలో ప్రాజెక్టుల నుంచి ముందే తప్పుకోవాలని, కానీ సినిమాలు పూర్తయ్యాక పరిశ్రమను తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని ఆమె హితవు పలికారు.

టాలీవుడ్‌పై రాధికా ఆప్టే కామెంట్స్

తెలుగు సినిమాల్లో తనకు ఎదురైన అనుభవాలపై నటి రాధికా ఆప్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ సినిమాలో మేనమామను పెళ్లి చేసుకునే పాత్ర చేయాల్సి వచ్చిందని, అలాగే వయసులో పెద్ద నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది నటీమణులకు కేవలం తెల్లటి చర్మం కారణంగానే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, స్టోరీ చెప్పినప్పుడే ఆయా సినిమాలను తిరస్కరించవచ్చు కదా అని కొందరు నెటిజన్లు రాధికా ఆప్టేను విమర్శిస్తున్నారు.

నార్త్-సౌత్ విభేదాలు వద్దు: రెజీనా

రాధికా ఆప్టే, జాన్వీల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రెజీనా.. తోటి నటీమణులకు తాను ఎప్పుడూ మద్దతుగా ఉంటానని, అయితే నార్త్-సౌత్ విభేదాలు పెంచేలా మాట్లాడటాన్ని మాత్రం తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో బాలీవుడ్ వైఖరిని సైతం ఆమె ప్రశ్నించారు. బాలీవుడ్ మూవీ ‘కేసరి- 2’లో తన పేరును తొలగించడాన్ని ప్రస్తావించిన రెజీనా.. ఇది సౌత్ నటులపై ఉత్తరాది వారు చూపిస్తున్న వివక్ష కాదా అని సూటిగా ప్రశ్నించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp