
హైదరాబాద్, సూర్య న్యూస్ : టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) తన మనసులోని ఆవేదనను బహిరంగంగా వ్యక్తపరిచారు. ‘ప్యారడైజ్’ (Paradise) సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడాలని అనిపించినప్పటికీ, కొన్ని విషయాలు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నానని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన వారికి ప్రస్తుత పరిస్థితుల్లో స్వేచ్ఛగా మాట్లాడటం మరింత ప్రమాదకరంగా మారిందని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. తాను ఏది మాట్లాడినా ఆ ప్రభావం విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లల మీద పడుతుందని, వారికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని భయపడి ఒక గిరి గీసుకుని ఉండాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో విషయాల గురించి మాట్లాడాలని, నేరుగా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెప్పాలని తన మనసులో బలంగా ఉన్నప్పటికీ పరిస్థితుల వల్ల మౌనంగా ఉండాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే, మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఆయన ఆవేదన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



