|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

Kayadu Lohar : నా పేరు వెనుక ఆ రాక్షస రాజు భార్య స్పూర్తి.. ‘కయాదు లోహర్’ అంటే అర్థం అదేనట!

హైదరాబాద్, సూర్య న్యూస్ : న్యాచురల్ స్టార్ నానితో ‘ప్యారడైజ్’ (Paradise Movie) సినిమాలో నటిస్తున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar) తన పేరు వెనుకున్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. పురాణాల స్ఫూర్తితో తన తల్లిదండ్రులు తనకు ఆ పేరు పెట్టారని ఆమె వెల్లడించారు.

హిరణ్యకశిపుడి భార్య పేరు

హిందూ పురాణాల్లోని రాక్షస రాజు హిరణ్యకశిపుడి భార్య పేరు ‘కయాదు’ అని, ఆ పేరు మీదుగానే తనకు నామకరణం చేశారని ఈ బ్యూటీ తెలిపారు. ఇక తన ఇంటి పేరు ‘లోహర్’గా మారడం వెనుక కూడా ఒక కథ ఉందని ఆమె వివరించారు. వాస్తవానికి తమ అసలు ఇంటి పేరు కద్దెలి అని, అయితే తమ కుటుంబం అస్సాం నుంచి పుణేకు మకాం మార్చిన తర్వాత తన తండ్రి ఇంటి పేరును లోహర్‌గా మార్చారని కయాదు పేర్కొన్నారు.

‘లోహర్’ అంటే ఇనుప మహిళ

‘లోహర్’ అనగా ఇనుప మహిళ (ఐరన్ లేడీ) అని అర్థం వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన నటించిన ‘ప్యారడైజ్’ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటిస్తూ తన పేరు వెనుకున్న ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని రివీల్ చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp