|  
● FLASH NEWS
Kohli: కోహ్లీ–గిల్ సెంచరీలు.. వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం  •  CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  •  Banks: ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్!  •  CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం  • 
Skip to content

KTR: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సందడి.. పార్టీ నేతలతో ‘ది ప్యారడైజ్’ చూసిన కేటీఆర్

ktr paradise movie theater
ktr paradise movie theater

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ను ఆయన పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులతో కలిసి వీక్షించారు. శుక్రవారం (సెప్టెంబర్ 26) రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రసిద్ధ సుదర్శన్ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశారు.

థియేటర్‌ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు చిత్ర వీక్షణకు హాజరయ్యారు. కేటీఆర్ రాకతో సుదర్శన్ థియేటర్ ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నినాదాలతో సందడి చేశారు.

శంకరన్న పాత్రపై ప్రత్యేక ఆసక్తి

ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పోలి ఉందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. థియేటర్‌లో ఆ సన్నివేశాలు ప్రదర్శితమవుతున్న సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాల్లోకి కాగితాలు విసిరి సందడి చేసినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా తెలుస్తోంది. కాగా, చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూసిన కేటీఆర్, అనంతరం చిత్ర బృందానికి మరియు దర్శకుడికి అభినందనలు తెలిపారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp