
సూర్య న్యూస్ డెస్క్ : ఏషియన్ గేమ్స్ ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌పై భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) మరోసారి చెలరేగి ఆడాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌పై గెలవాలన్న పాక్ ఆశలపై నీళ్లు చల్లి, టీమిండియాకు స్వర్ణ పతకం (Gold Medal) దక్కడంలో కీలక పాత్ర పోషించాడు.
గతేడాది ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో చిత్తు చేసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన తిలక్.. తాజాగా ఏషియన్ గేమ్స్ ఫైనల్లోనూ అదే తరహాలో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ 61 పరుగుల వద్ద ఔటైన తర్వాత, జట్టు స్కోరు కనీసం 180 దాటడం కష్టమే అనిపించిన దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 22 బంతుల్లోనే 51 పరుగులు సాధించిన అతడు, పాకిస్థాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు. క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్ వల్లే భారత్‌కు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం సాధ్యపడింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



