|  
● FLASH NEWS
Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  • 
Skip to content

Devara: ‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై భగ్గుమన్న టాలీవుడ్

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర (Devara) చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోపై టాలీవుడ్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ హీరోయిన్‌ను అత్యంత అవమానకర రీతిలో చూపించడంపై సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చట్టపరమైన చర్యలు తప్పవన్న ఎన్టీఆర్

మహిళలను దేవతలుగా పూజించే మన దేశంలో ఏఐ ద్వారా ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు సృష్టించడం అత్యంత నీచమైన చర్య అని హీరో ఎన్టీఆర్ ఖండించారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వారితో పాటు షేర్ చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

పరిశ్రమ మొత్తం ఏకమవ్వాలి.. చిరంజీవి పిలుపు

ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళలను కించపరచడం దారుణమని, రేపు ఈ పరిస్థితి ఎవరికైనా ఎదురుకావచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చిత్ర పరిశ్రమ మొత్తం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ, సపోర్ట్ సెల్ ఏర్పాటు చేయాలని రికమండ్ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాలను ఆయన తన పోస్ట్‌లో ట్యాగ్ చేశారు.

డిజిటల్ లైంగిక దాడితో సమానం.. విజయ్ దేవరకొండ

చుట్టమల్లే సాంగ్ ఏఐ మార్ఫింగ్‌పై హీరో విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. కొంతమంది ఇడియట్స్ ఏఐని వాడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారని, ఇది డిజిటల్ లైంగిక దాడితో సమానమని ఆయన విమర్శించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారికి అత్యంత కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తున్న ఎన్టీఆర్ బృందానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

హీరో ఎన్టీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేసిన నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు. చట్టపరమైన చర్యలు తప్పవని తెలియడంతో చాలా మంది వెంటనే తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp