|  
● FLASH NEWS
Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  •  Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  • 
Skip to content

ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (Telangana ACB) అధికారులు తమ దాడులను తీవ్రం చేశారు. తాజాగా వేర్వేరు ఘటనల్లో భారీగా లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారిణులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన అనంతరం వారు కన్నీటిపర్యంతమయ్యారు.

రూ.4 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి

జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోల్కొండ జోన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తులసీరామ్ సునీత.. ఒక భవన నిర్మాణ అనుమతి జారీ చేయడం కోసం ఏకంగా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వల పన్నారు. ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా సునీతను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోవడంతో సదరు అధికారిణి విలపించారు.

రూ.లక్ష లంచం తీసుకుంటూ చిక్కిన డీఎంహెచ్‌ఓ

మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (DM&HO) డాక్టర్ స్వర్ణ కుమారి సైతం ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నారు. గతంలో మూతబడిన ఒక ఫిజియోథెరపీ సెంటర్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చేందుకు ఆమె రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి ఆ నగదును తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కీలక మహిళా అధికారులు అవినీతి ఆరోపణలతో పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp