|  
● FLASH NEWS
PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  • 
Skip to content

PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్

అమరావతి, సూర్య న్యూస్ : తిరుపతి జిల్లాలో ‘పల్లె పండుగ’ (Palle Panduga) కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Dy CM Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు.

పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య ఇటీవల కూటమి ప్రభుత్వం సుమారు రూ.4.75 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డును నిర్మించింది. అయితే ఆ రోడ్డు వెళ్లే మార్గంలో తన పొలం ఉందని స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. స్థానిక నాయకులు, అధికారులు సర్దిచెప్పడంతో ఎట్టకేలకు వారం క్రితం ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి.

రోడ్డు నిర్మాణం పూర్తయిన నాలుగు రోజులకే ఆదివారం ఉదయం సుబ్బారెడ్డి మరో నాయకుడు వెంకటసుబ్బారెడ్డితో కలిసి ఏకంగా ట్రాక్టర్‌ తీసుకువచ్చి కొత్తగా వేసిన రోడ్డును సుమారు 100 మీటర్ల మేర దున్నేశారు. ఈ దుర్మార్గపు చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలి

కొత్త రోడ్డును తవ్వేసిన ఘటనపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు విఘాతం కలిగించే వారి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేసిన ఆయన.. ధ్వంసమైన రోడ్డు కారణంగా జరిగిన నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నిందితుల నుంచే వసూలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp