
జగిత్యాల, సూర్య న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జగిత్యాల (Jagtial) జిల్లా గుల్లకోటలో శ్రీ ముదుగంటి అనంతరెడ్డి ట్రస్ట్ (Trust) ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముదుగంటి వెంకటరమణ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీల్లో స్థానిక బాలురు, బాలికల జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను కనబరిచారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం, వారిలో ఐకమత్యం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో గెలుపొందిన జట్లకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా రూ. 3,000, ద్వితీయ బహుమతిగా రూ. 2,000 చొప్పున విజేతలకు ప్రదానం చేశారు.

క్రీడలతో క్రమశిక్షణ
ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ ముదుగంటి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల ద్వారా క్రమశిక్షణను అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. శారీరక, మానసిక వికాసానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరిగెల రవి, మాజీ ఎంపీటీసీ మైపాల్ రెడ్డి, గుండ తిరుపతి, బొంగోని వెంకటేష్, ఎండి రఫీక్, బిసగోని తిరుపతి, పాలకుర్తి సుభాష్, మడప వినయ్, మనం సతీష్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో పీఈటీలు జైనపురం సాయి, ఎం.డి. సాన, మిట్ట అనూష, రోషిని, గౌతమి తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



