
అమరావతి, సూర్య న్యూస్ : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల (Elections) నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ (AP DGP) హరీశ్ గుప్తా స్పష్టం చేశారు. రాజకీయ పలుకుబడి ఉందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టం నుంచి ఎవరికీ రక్షణ ఉండదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియలో అల్లర్లకు పాల్పడే మూకలను డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పక్కాగా గుర్తిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా లేకపోయినా, తెరవెనుక ఉండి హింసను ప్రేరేపించే రాజకీయ నాయకులపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడే వారు ఎవరైనా సరే చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రతి కార్యక్రమం, ర్యాలీలు తప్పనిసరిగా పోలీసుల ముందస్తు అనుమతులకు లోబడే జరగాలని ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



