
హైదరాబాద్, సూర్య న్యూస్ : కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఓ కన్నడ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించి (Box Office Collections) ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకుపోతోంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో ‘ప్రేమద ఊరాలి’ అనే సినిమా ఇప్పుడు 2026లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది. రూ. 2-3 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం.. కర్ణాటకలో ఏకంగా బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్-1’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ (రూ.134.2 కోట్లు)ను సైతం అధిగమించింది. దీంతో ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది.

కర్ణాటక బాక్సాఫీస్ చరిత్రలో ప్రస్తుతం తొలి మూడు స్థానాల్లో కాంతార: చాప్టర్-1 (రూ.259 కోట్లు), కాంతార (రూ.185 కోట్లు), కేజీఎఫ్-2 (రూ.183 కోట్లు) ఉండగా, ఆ తర్వాత ప్రతిష్టాత్మక నాలుగో స్థానాన్ని ‘ప్రేమద ఊరాలి’ ఆక్రమించింది. పల్లెటూరిలో ఉండే తండ్రీకొడుకుల జీవితంలోకి ఓ మోడ్రన్ అమ్మాయి ప్రవేశిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పాజిటివ్ మౌత్ టాక్తో కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ప్రేమనే ఊరిలో’ అనే పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



