|  
● FLASH NEWS
ట్రంప్ నన్ను దారుణంగా రేప్ చేశాడు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన ఆరోపణలు  •  PNB: జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం  •  Nirmala: ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు.. రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్  •  AP Politics: ‘జగన్ 2.0’ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర వార్నింగ్  •  Records: కివీస్‌పై టీమిండియా సునామీ.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్  • 
Skip to content

Nirmala: ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దు.. రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్

ఢిల్లీ, సూర్య న్యూస్ : దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ (Tata Group) వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.

టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పదవీకాలాన్ని పొడిగించడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కలిసి టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. భారత వ్యాపార రంగం వారి ఆటబొమ్మ కాదని, బిజినెస్ లీడర్లెవరూ స్పందించే ధైర్యం చేయడం లేదని మండిపడ్డారు. ఎంతకాలం సైలెంట్‌గా ఉంటారని, వాళ్లు మిమ్మల్ని అధీనంలోకి తీసుకునే వరకూ ఇలానే ఉంటారా? అంటూ రాహుల్ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వ్యాపార, చట్టపరమైన విషయాలను ‘నేరం’ అని ముద్ర వేయొద్దని ఆమె సూచించారు. పరిశ్రమల వృద్ధిపై ఇన్నాళ్లూ విషం కక్కారని, ఇప్పుడు ఈ వివాదాల్లోకి వ్యాపారవేత్తలను లాగుతున్నారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో లైసెన్స్ రాజ్‌తో కాంగ్రెస్ పార్టీయే దేశ వ్యాపారాన్ని నాశనం చేసిందని నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp