
ఢిల్లీ, సూర్య న్యూస్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు (Transactions) నిర్వహించకుండా, జీరో బ్యాలెన్స్‌తో ఉన్న బ్యాంకు ఖాతాలను త్వరలో క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
నిరుపయోగంగా ఉన్న అకౌంట్లు సైబర్ నేరాలకు, ఇతర మోసాలకు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఖాతాల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే, ఖాతాదారులు తమ అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒక అవకాశం కల్పించింది.
ఈ అకౌంట్లను మళ్లీ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లు నవంబర్ 10వ తేదీలోగా తమ దగ్గర్లోని పీఎన్బీ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ (KYC) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. నిర్దేశించిన గడువులోగా కేవైసీ అప్డేట్ చేయకపోతే ఆయా ఖాతాలను శాశ్వతంగా మూసివేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



