
అమరావతి, సూర్య న్యూస్ : అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో సీఎం వెంటనే బాధిత విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు.
బాలికను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన బాధిత తల్లికి హామీ ఇచ్చారు. తరగతి గదిలోనే చెట్లు కోసే రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ వార్తపై మీ స్పందన?

పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



