|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు

raptadu police firing celebrations
raptadu police firing celebrations

అమరావతి, సూర్య న్యూస్ : అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు (Raptadu Encounter). ఆత్మకూరు అటవీ ప్రాంతంలో తలదాచుకున్న నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపైకి ఎదురుతిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు ఆరు రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిపై పోలీసుల కాల్పుల వార్తతో రాప్తాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో స్థానికులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తరగతి గదిలోనే ఒక చిన్నారిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఉన్మాదికి తగిన శాస్తి జరిగిందని, అతడిని ఎంకౌంటర్ చేయాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అంతకుముందు, ఉన్మాది హేమంత్‌ను ఉరితీయాలంటూ రాప్తాడు గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారి (NH 44) పై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp