
బోథ్, సూర్య న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ కారణంతో రైతు మరణించినా వారి కుటుంబానికి వెంటనే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా ‘రైతు బీమా’ పథకాన్ని అమలు చేశామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిందని కేటీఆర్ మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆదేశాల మేరకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేసినట్లు కేటీఆర్ తన బోథ్ పర్యటనలో వెల్లడించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, బాధిత రైతు కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



