|  
● FLASH NEWS
Raptadu: రాప్తాడు ఉన్మాదిపై పోలీసుల కాల్పులు.. టపాసులు పేల్చి సంబరాలు  •  HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  • 
Skip to content

UPI: యూపీఐ పేమెంట్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్.. రోజుకు లక్ష కోట్లు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. రోజువారీ యూపీఐ (UPI) లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. దేశ చరిత్రలో తొలిసారిగా అక్టోబర్ నెలలో సగటున రోజువారీ యూపీఐ లావాదేవీలు ఏకంగా లక్ష కోట్ల రూపాయలను దాటాయి. గత సెప్టెంబర్ నెలలో నమోదైన సగటు రోజువారీ లావాదేవీల రికార్డు రూ. 98,000 కోట్లను అక్టోబర్‌లో అధిగమించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నెలవారీ లావాదేవీల పరంగా కూడా సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో 2026 మే నెలలో అత్యధికంగా రూ. 29.9 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, తాజాగా అక్టోబర్ నెలలో ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ ఏకంగా రూ. 31.53 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. పండుగ సీజన్ కావడంతో పాటు, యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ (MDR) చార్జీల అమలును వాయిదా వేయడం ఈ సరికొత్త రికార్డుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతకుముందు, యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు విధించే అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు, వివిధ సంస్థల విజ్ఞప్తి మేరకు, పండుగ సీజన్‌లో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ చార్జీల అమలును దీపావళి తర్వాతకు వాయిదా వేసినట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది. త్వరలోనే చార్జీలు ఎప్పటి నుంచి అమలవుతాయనే కచ్చితమైన తేదీని ప్రకటిస్తామని తెలిపింది. గతంలో జనవరి 1 నుంచే చార్జీల విధింపు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ, వ్యాపారుల అభ్యర్థన మేరకు ప్రస్తుతానికి వాయిదా వేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp