
హైదరాబాద్, సూర్య న్యూస్ : కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) ఇన్‌ఛార్జ్ వైస్-ఛాన్సలర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం నియమితులయ్యారు. మహిళా వర్సిటీ ప్రస్తుత వీసీ ఆచార్య సూర్య ధనంజయ్ వ్యక్తిగత పని మీద నవంబర్ 13 వరకు అమెరికాకు వెళ్లడంతో, ఆమె గైర్హాజరీలో ఆచార్య కుమార్ మొలుగరానికి ఈ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వవిద్యాలయ కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా సజావుగా సాగేందుకే ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఆచార్య కుమార్ మొలుగరం ఉస్మానియా యూనివర్సిటీ వీసీ బాధ్యతలతో పాటు అదనంగా మహిళా వర్సిటీ పరిపాలన, విద్యా సంబంధిత వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు.
నవంబర్ 13న ఆచార్య సూర్య ధనంజయ్ తిరిగి వచ్చేవరకు ఆయన ఈ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ఉస్మానియా విశ్వవిద్యాలయం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



