|  
● FLASH NEWS
Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  •  Supreme: ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెండ్ అయినట్లే: సుప్రీంకోర్టు  •  Cinematographer: షూటింగ్‌లో అస్వస్థత.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత.. సినీ పరిశ్రమలో విషాదం  • 
Skip to content

Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ : వారసత్వ ఆస్తుల (Ancestral Property) పంపకాల వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. తాత నుంచి సంక్రమించిన ఆస్తి పంపకంలో భాగంగా తండ్రికి వాటాగా వచ్చిన భూమిలో మనవడికి ఎలాంటి జన్మతః హక్కు ఉండదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆస్తి పంపకాల తర్వాత తండ్రికి కేటాయించిన వాటా అంతా ఆయన వ్యక్తిగత ప్రత్యేక ఆస్తిగా మాత్రమే పరిగణించబడుతుందని కోర్టు తేల్చిచెప్పింది.

తాత ద్వారా సంక్రమించిన భూమిని తన తండ్రి అమ్ముకున్నారని, ఆ భూమిలో తనకు సగం వాటా రావాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది. తండ్రికి వాటాగా వచ్చిన ఆస్తిపై ఆయనకు పూర్తి అధికారాలు ఉంటాయని, దానిలో మనవడు హక్కు కోరలేడని స్పష్టం చేస్తూ సదరు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp