
హైదరాబాద్, సూర్య న్యూస్ : ప్రజా అవసరాల కోసం కేటాయించిన కూకట్పల్లి (Kukatpally) – మూసాపేట ట్రక్ పార్క్ భూములను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం తక్షణమే ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, అవసరమైతే ప్రజా ఉద్యమమే తమ మార్గమని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఖుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



