|  
● FLASH NEWS
Gowda: గౌడ సామాజిక వర్గ చరిత్రపై డాక్టర్ పొన్నం ముత్యం గౌడ్ పరిశోధన  •  Local Elections: సర్పంచ్ పదవి కోసం బంపర్ ఆఫర్లు.. రూ.కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు  •  Nvidia: గూఢచారితో సంబంధాలు.. సీఈవో పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్  •  Jobs: కృష్ణా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్  •  Teenmar: బీసీ రాజ్యాధికార పాదయాత్రలో అనుమానాస్పద రోడ్డు ప్రమాదం.. డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు  • 
Skip to content

ISRO: ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వారికి బంపర్ ఆఫర్

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 2వ తేదీని దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ వెల్లడించింది.

ఖాళీల వివరాలు.. అర్హతలు

మొత్తం 26 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇస్రో ఎస్ఏసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 9, టెక్నీషియన్ అప్రెంటిస్ 5, ట్రేడ్ అప్రెంటిస్ 12 ఖాళీలు ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, సివిల్, ప్రొడక్షన్ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. నాన్-ఇంజినీరింగ్ (ఇతర డిగ్రీలు) పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీకాం, బీసీఏ లేదా బీఏ (హిందీ/ఇంగ్లీష్) పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్ అప్రెంటిస్: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయో పరిమితి.. ఎంపిక విధానం

గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వయసు 2026 డిసెంబర్ 2 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ట్రేడ్, టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 11న ప్రారంభం కాగా, దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 2. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.sac.gov.inను సందర్శించవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp