|  
FLASH NEWS
Kakinada Port : కాకినాడ పోర్టులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. రూ.65 లక్షల సరుకు సీజ్  •  Vijayawada Crime News : సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం.. సిట్ రిమాండ్ రిపోర్టులో దారుణ విషయాలు!  •  ​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  • 
Skip to content

అమెరికా కొత్త చట్టంతో 100 శాతం పన్నుల ముప్పు.. భారత ఎగుమతులపై ప్రభావం ఎలా ఉండబోతోంది?

us 100 percent tariffs on indian exports
us 100 percent tariffs on indian exports

సూర్య న్యూస్ డెస్క్ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు (Import Tariffs) విధించే అధికారంతో కూడిన కొత్త చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో ఈ చట్టం పరిధిలోకి వచ్చే భారత్‌ ఎగుమతులపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా ఆమోదం పొందిన ‘లిండ్సే ఓ. గ్రహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్’ నిబంధనల ప్రకారం.. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల తర్వాత కూడా రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లు కొనసాగిస్తే, సంబంధిత దేశాలపై అధ్యక్షుడు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ 100 శాతం పన్నుల విధింపు అనేది తక్షణమే అమలు కాదు. ఎంత శాతం పన్ను విధించాలి, ఎప్పుడు అమలు చేయాలి, ఏయే ఉత్పత్తులకు మినహాయింపులు ఇవ్వాలనే అంశాలన్నీ పూర్తిగా వైట్‌హౌస్ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుత పన్నులు.. మినహాయింపులు

ప్రస్తుతం అమెరికాకు వెళ్లే చాలా వరకు భారత ఉత్పత్తులపై సాధారణ పన్నులకు అదనంగా 10 శాతం సుంకం అమల్లో ఉంది. అయితే మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వాటిలో దాదాపు 45 శాతం వాటా కలిగిన ఫార్మా, స్మార్ట్‌ఫోన్ల వంటి కీలక ఉత్పత్తులకు ఈ అదనపు పన్ను నుంచి మినహాయింపు లభించింది. ఒకవేళ ట్రంప్ చట్టం ప్రకారం భవిష్యత్తులో గరిష్ట స్థాయిలో పన్నులు విధిస్తే అమెరికా మార్కెట్లో రత్నాలు, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్, రసాయన ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా మారి గిరాకీ పడిపోయే ప్రమాదం ఉంది.

ఇది కేవలం ఒత్తిడి వ్యూహమేనా?

కొత్త చట్టం ద్వారా లభించిన టారిఫ్ అధికారాన్ని అమెరికా తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భారత్ నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటీఆర్ఐ) లాంటి సంస్థలు విశ్లేషిస్తున్నాయి. దీనికి లొంగిపోయి ఏకపక్ష రాయితీలకు అంగీకరించకూడదని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోవైపు ఇంధన భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, వివిధ దేశాల నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతిమంగా రూపాయి విలువ, ట్రేడ్ బ్యాలెన్స్‌పై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp