
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని (Telangana State) బీసీ గురుకులాలకు సొంత భవనాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల పరిస్థితిపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో మొత్తం 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో కేవలం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కలెక్టర్ల సమన్వయంతో స్థల సేకరణ
అధికారుల వివరణపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. వివిధ జిల్లాల్లో గురుకుల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలకు అవసరమైన స్థలాలు అందుబాటులోకి రాగానే, నిధుల మంజూరు తదితర తదుపరి చర్యల కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం తో చర్చిస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అద్దె భవనాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



