|  
FLASH NEWS
ఆర్టీసీ కార్గో ప్రైవేట్ చేతికి.. 10-15 ఏళ్ల ఒప్పందం, ఛార్జీలపై ఆందోళన  •  గొల్లగుప్ప గ్రామస్థుల అస్వస్థత ఘటనపై సీఎం ఆరా.. సమగ్ర విచారణకు ఆదేశాలు  •  పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మమతా బెనర్జీ మేనకోడలు మృతి  •  దేశ రాజధానిలో మరో నిర్భయ తరహా దారుణం.. కదులుతున్న బస్సులో 47 కిలోమీటర్ల మేర మైనర్‌పై రాక్షసత్వం!  •  SCO సదస్సులో పాకిస్థాన్ ఫొటో ఎడిటింగ్ వివాదం.. అసలు ఫొటోతో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!  • 
Skip to content

కాంగ్రెస్ దాడులకు నిరసనగా బీజేపీ ఆందోళన.. మర్రిగూడలో నేతల అరెస్టు

మర్రిగూడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను మర్రిగూడ మండల కేంద్రంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పందుల రాములు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల వంటి ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిపై నిలదీస్తున్న బీజేపీ నాయకులపై దాడులకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటే ఏమి చేయాలో పాలుపోకనే కాంగ్రెస్ గుండాలను ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు వెనపల్లి శ్రీనివాసరావు, అంబాల రమేష్, జింకల లింగస్వామి, మామిడి కమలాకర్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp