
ఢిల్లీ, సూర్య న్యూస్ : విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలపడంతో నిరసన రద్దు. జంతర్ మంతర్ ధర్నా ఎఫ్ఐఆర్‌ల కొట్టివేత కోసం సుప్రీంను ఆశ్రయించిన పలు రాష్ట్రాలు.
ఢిల్లీలో ఈ నెల 5వ తేదీన చేపట్ట తలపెట్టిన నిరసన ర్యాలీని రద్దు చేస్తున్నట్లు CJP ప్రకటించింది. మరోసారి ఆందోళన చేపట్టాలని గతంలో ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు అధికారికంగా తెలియజేసింది.
విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయడంతో పాటు, వారికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఈ హామీ నేపథ్యంలోనే తాము ప్రొటెస్ట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు CJP కోర్టుకు వివరించింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలు రాష్ట్రాలు
గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



