|  
FLASH NEWS
NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  •  AP Weather Alert : ఏపీకి పొంచి ఉన్న తీవ్ర ముప్పు.. ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్!  •  AP Politics : లోకేశ్ వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం సీట్లు మావే: పవన్ కళ్యాణ్  • 
Skip to content

DOST Spot Admissions 2026 : కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. తేదీలు ఇవే

కూకట్‌పల్లి, సూర్య న్యూస్ : దోస్త్ (DOST 2026) ప్రక్రియ ద్వారా కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు (Spot Admissions) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చందన ఒక ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

నేడు ఖాళీల వివరాల వెల్లడి

కళాశాలలో ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే పూర్తి వివరాలను సెప్టెంబర్ 23న కళాశాల నోటీస్ బోర్డుతో పాటు అధికారిక దోస్త్ వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నారు. విద్యార్థులు ఈ వివరాలను పరిశీలించి అడ్మిషన్ల కోసం సిద్ధం కావాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

ఒరిజినల్ సర్టిఫికెట్స్ తప్పనిసరి

స్పాట్ అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ధృవపత్రాలను తమ వెంట తీసుకురావాలని ప్రిన్సిపల్ చందన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో మరోసారి ప్రత్యేక స్పాట్ అడ్మిషన్ రౌండ్ కూడా నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన విద్యార్థులు సకాలంలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp