|   
🔴 BREAKING NEWS ► Bandi Bhagirath Bail : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు US President Trump : ఇరాన్ కు డేంజర్ వార్నింగ్.. ఖార్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన Prashna Ravan Arrest : యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు.. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు Pawan Kalyan Fan Niranjan Death : కన్నీరు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ వీరాభిమాని మృతి.. ‘ఓజీ 2’ చూద్దామనుకున్నాడు అంతలోనే తీవ్ర విషాదం TS Home Dept Jobs : నిరుద్యోగులకు పండుగే.. హోంశాఖలో 7 వేల కొలువులు, 5 వేల పోలీస్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్
Skip to content

పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

వారంలోగా పనులు పూర్తి కావాలి: అధికారులకు జగిత్యాల కలెక్టర్ అల్టిమేటం

కోరుట్ల: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గురువారం కోరుట్ల మండలంలోని విద్యాసంస్థల్లో మెరుపు తనిఖీలు చేపట్టారు. కల్లూరులోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించిన ఆయన పాఠశాల నిర్వహణ తీరుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసిన కలెక్టర్ వంట సరుకుల నాణ్యతపై ఆరా తీశారు. కూరగాయలు తాజాగా ఉండాలని మరియు వంటకు గ్యాస్ పొయ్యిలను మాత్రమే వాడాలని ప్రిన్సిపాల్‌కు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి విద్యా ప్రమాణాలను మరియు వసతులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణతో కూడిన చదువు ఎంతో అవసరమని విద్యార్థులను కలెక్టర్ ప్రోత్సహించారు.

అనంతరం కోరుట్ల పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌లో నిర్మాణంలో ఉన్న సైన్స్ ల్యాబ్ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్లను ప్రశ్నించిన ఆయన త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పీఎం శ్రీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను వారంలోగా పూర్తి చేయాలని కఠిన గడువు విధించారు. పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp