|  
FLASH NEWS
BRAOU Admissions 2026: డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు  •  Telangana Cabinet Expansion: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కేనా? తెరపైకి మునుగోడు ఎమ్మెల్యే పేరు!  •  YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  • 
Skip to content

Kaloji Narayana Rao Birth Anniversary: అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు

హైదరాబాద్, సూర్యా న్యూస్ : ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ రావు (Kaloji Narayana Rao) 112వ జయంతి వేడుకలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణారెడ్డి పాల్గొని కాళోజి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి, అక్షరాలతో ప్రజలను చైతన్యవంతం చేసిన కాళోజి సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

​ఈ నివాళి కార్యక్రమంలో ప్రొఫెసర్ ఇ. సుధారాణి, ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాస్, ప్రొఫెసర్ పల్లవీ కాబ్దే, ప్రొఫెసర్ బొజు శ్రీనివాస్, ప్రొఫెసర్ పి. వెంకటరమణ, ప్రొఫెసర్ ఎన్. రజని, ప్రొఫెసర్ కె. శ్రీదేవి, ప్రొఫెసర్ కె. ప్రమీల, డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, ఎన్సీ వేణుగోపాల్, కాంతం ప్రేమ్ కుమార్, బి. పాండు, మియా జానీలతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp