|  
FLASH NEWS
Disha Salian Case : మాజీ సీఎం కుమారుడికి ఏకంగా రూ.500 కోట్ల లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?  •  Keesara SI ACB Trap : స్టేషన్ బెయిల్ కోసం రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ  •  Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  • 
Skip to content

ఖాజాగూడ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కుమారుడు అరెస్ట్

Art director anand sai son
Art director anand sai son

హైదరాబాద్, సూర్య న్యూస్ : హైదరాబాద్‌లోని ఖాజాగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన అనంతరం పరారీలో ఉన్న అతడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రమాదం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నందూలాల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అక్కడే ఉన్న జైద్ షా అనే వ్యక్తి స్పందించి, గాయపడిన నందూలాల్‌ను తన కారులో ఎక్కిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది.

సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన సందీప్ కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నందూలాల్ మృతి చెందగా, జైద్ షా సైతం గాయాలపాలయ్యారు.

సీసీటీవీ ఫుటేజీతో దొరికిపోయిన నిందితుడు

ప్రమాదం జరిగిన వెంటనే సందీప్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పక్కా ఆధారాలతో సందీప్‌ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp