|  
FLASH NEWS
సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  •  Nalgonda News : చండూరు మార్కెట్ యార్డుకు కన్నం.. 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ  • 
Skip to content

ప్రపంచ ఏఐ కేంద్రంగా తెలంగాణ: అమెరికా పెట్టుబడిదారులకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

​న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (AI) రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు వేదికగా మారుతోందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. దేశ రాజధానిలో జరిగిన ప్రతిష్టాత్మక “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026”లో భాగంగా అమెరికా-ఇండియా వాణిజ్య మండలి (USIBC) ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో ఉన్న అత్యున్నత టెక్నాలజీ ఎకోసిస్టం అమెరికా పెట్టుబడిదారులకు అనేక నూతన అవకాశాలను కల్పిస్తోందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.​

అమెరికా టెక్ దిగ్గజాలతో భాగస్వామ్యంతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమెరికా టెక్ దిగ్గజాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు మరియు ముందుచూపుతో కూడిన స్థిరమైన విధానాలు ఏఐ పరిశోధనలకు ఆలంబనగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం వ్యవసాయం విద్య మరియు పట్టణాభివృద్ధి వంటి రంగాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచేలా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టామని మంత్రి అన్నారు.​

ఏఐ యూనివర్సిటీ మరియు హబ్ ల ఏర్పాటువేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ప్రపంచంతో పోటీ పడేందుకు ఏఐ యూనివర్సిటీ మరియు ఏఐ హబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతిభావంతులైన స్కిల్ ఫోర్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో ఈ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవలపై రియల్ టైం పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp