
నల్లగొండ: నారాయణపురం మండలం మహమ్మదాబాద్‌కు చెందిన పచ్చిపాల పెద్ద పాపయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి ఆటంకం కలుగుతున్న విషయం సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం దృష్టికి వచ్చింది.
దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్సీ సత్యం, రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతు చొరవతో ప్రభుత్వం నుంచి రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేలు) ఎల్వోసీ (LOC) మంజూరు చేయించారు. ఆ మంజూరు పత్రాన్ని నేడు నల్లగొండలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్వయంగా అందజేశారు.


పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



