|  
FLASH NEWS
PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  •  PM Modi Ganesh Puja: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇంట గణపతి పూజలో పాల్గొన్న ప్రధాని  •  Major Rishabh Singh : ఆర్మీకి యువ మేజర్ ముందస్తు వీడ్కోలు.. రాజీనామాకు అసలు కారణం ఇదే  • 
Skip to content

రంగరాయ ప్రసాద్‌ను కలిసిన శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు: శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం అందజేత

హైదరాబాద్, సూర్య న్యూస్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్‌ను శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకలగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగాన్ని ఆయనకు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

​శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తమకు ఎంతో అండగా ఉంటూ, ప్రతి ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమంలోనూ నిరంతరం సహకరిస్తున్న రంగరాయ ప్రసాద్‌కు ఈ సందర్భంగా సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేవలం రాజకీయ నేతగానే కాకుండా, సామాజిక బాధ్యతతో సంఘం అభివృద్ధికి ఆయన అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని వారు కొనియాడారు. భవిష్యత్తులో కూడా బ్రాహ్మణ సంఘం కార్యక్రమాలకు తమ వంతు మద్దతు కొనసాగుతుందని రంగరాయ ప్రసాద్ వారికి హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు సుధాకర్, ప్రతినిధి నరసింహారావుతో పాటు 273 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లూరి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో పంచాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు పండుగల విశిష్టతను ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆకాంక్షించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp