|  
FLASH NEWS
Dadasaheb Phalke Award 2024 : ‘కేజీఎఫ్’ నటుడికి అత్యున్నత పురస్కారం.. అనంత్ నాగ్‌ను వరించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!  •  CM Revanth Reddy on KCR Farmhouse : కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు.. ఆ భూములను దళితులకు పంచుతామని ప్రకటన  •  PM Modi Friend : ప్రధాని మోదీని కలిసిన కొద్దిరోజుల్లోనే పరిష్కారం.. దశాబ్దాల భూ వివాదంలో ఆ స్నేహితుడికి ఊరట ఎలా లభించిందో తెలుసా?  •  Miss Universe India 2026 : మిస్ యూనివర్స్ వేదిక నుంచి ఆఫీస్‌కు.. తిరిగి విధుల్లో చేరిన అందాల భామ  •  Allu Arjun Father in Law : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు..  • 
Skip to content

Ram Gopal Varma Tweet : విద్యా వ్యవస్థపై ఆర్జీవీ సంచలన పోస్ట్… విద్యార్థులు గొర్రెలా లేక బొద్దింకలా?

Hyderabad, Surya News: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల వివాదం (NEET Protests) నడుస్తున్న వేళ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) భారతీయ విద్యా వ్యవస్థ (Indian Education System) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను గొర్రెల మందలా చూసే పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), నందన్ నిలేకని (Nandan Nilekani) లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా (Social Media) ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సీఈఓలు (Top CEOs) భవిష్యత్తులో ప్రవేశ స్థాయి ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారని వర్మ గుర్తు చేశారు. కానీ మనం మాత్రం వెంటిలేటర్ పై ఆఖరి శ్వాస తీసుకుంటున్న విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు ఆందోళనలు చేస్తున్నామని ఆయన పెదవి విరిచారు.

కృతిమ మేధస్సు (Artificial Intelligence) తో విద్యా రంగంలో కొత్త శకం మొదలైందని ఆర్జీవీ (RGV) అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనకు సంస్థాగత విద్య (Institutional education) కంటే కూడా కస్టమైజ్డ్ విద్య (Customized education) చాలా అవసరం అని ఆయన స్పష్టం చేశారు. ఒక విద్యార్థి తన డిగ్రీ లేదా ఇంజనీరింగ్ (B Tech) కోర్సు వ్యవధిని తానే స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. కొందరు విద్యార్థులు నాలుగేళ్లలో నేర్చుకోలేని విషయాన్ని మరికొందరు ఆరు నెలల్లోనే గ్రహించగలరు. అలాంటప్పుడు వారిద్దరినీ ఒకే మూస పద్ధతిలో ఎందుకు బంధించాలి అని వర్మ (Ram Gopal Varma) ప్రశ్నించారు.

యూనివర్సిటీ క్యాలెండర్ (University calendar) ప్రకారం కాకుండా విద్యార్థి ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు పరీక్షలు నిర్వహించే రోజు రావాలని వర్మ ఆకాంక్షించారు. ఒక విద్యార్థి స్టీల్ స్ట్రక్చర్స్ (Steel structures) రంగంలో ప్రావీణ్యం పొందాలనుకుంటే సిస్టం దానికి తగ్గట్టుగా సహకరించాలి. పరీక్షా కేంద్రాల్లోకి (Exam halls) విద్యార్థులు తమకు ఇష్టమైన ఏఐ టూల్స్ (AI tools) తీసుకువెళ్లేందుకు అనుమతించాలి. వారు ఆ సాంకేతికతను ఎంత వేగంగా, సృజనాత్మకంగా ఉపయోగించగలరు అనేదే ప్రధానంగా పరీక్షించాలి.

​ఈ కొత్త విధానం వల్ల కలిగే లాభాలను కూడా వర్మ తన పోస్టులో వివరించారు. ఈ కొత్త సిస్టం ద్వారా విద్యా రంగంలో సమయం, ఖర్చు (Cost of education) భారీగా తగ్గుతాయి. ప్రతి విద్యార్థికి ఎప్పుడూ అలసిపోని ఒక పర్సనల్ ఏఐ ట్యూటర్ (Personal AI tutor) అందుబాటులో ఉండటం వల్ల అభ్యాస నాణ్యత అమాంతం పెరుగుతుంది. మొదటిసారిగా సిస్టం విద్యార్థిని అణచివేయకుండా సహాయకారిగా మారుతుంది. ఒక చిన్న పట్టణానికి చెందిన పేద విద్యార్థి కూడా ఖరీదైన ప్రైవేట్ కళాశాల (Private college) విద్యార్థితో సమానమైన అవకాశాలను పొందుతాడు. విద్యార్థులందరినీ ఒకేలాంటి ఉత్పత్తులుగా పరిగణించే బానిస నమూనా (Slave model) నుండి విద్యను విముక్తి చేయాలి. మనకు ఇప్పుడు కేవలం సంస్కరణలు కాదు, సమూలమైన విప్లవం (Revolution) కావాలని రామ్ గోపాల్ వర్మ (RGV) తన ట్వీట్ లో కుండబద్దలు కొట్టారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp