రిపోర్టర్: Madhukar, kodangal

హైదరాబాద్, సూర్య న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో (Kodangal) ఈ నెల 7, 8, 9 తేదీల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏకంగా రూ.9,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 భారీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. అలాగే రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో వంటి కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పర్యటనలో భాగంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం 9వ తేదీన హకీంపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



