|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

RS Praveen Kumar : రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్.. ఆ జీవో రద్దు చేయకుంటే అంబేడ్కర్ విగ్రహాల సాక్షిగా నిలదీస్తాం!

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి రావడానికి కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ల హామీలను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని సుమారు 10 వేల మంది స్థానిక కాంట్రాక్టర్ల కడుపు కొట్టి, అస్మదీయులకు దోచిపెట్టడమే లక్ష్యంగా తెచ్చిన జీవో నెం 17 (GO 17)ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు.

హామీలు ఒకట.. చేసేది ఇంకొకటా?

​కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration), చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పిందని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పాఠశాల విద్యార్థులకు అందించే నోట్ బుక్స్, యూనిఫాం, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసుల సరఫరా కోసం తెచ్చిన ₹2000 కోట్ల టెండర్లలో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెండర్లకు ఒక్క శాతం కూడా వాటా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణ కాంట్రాక్టర్లు పనికిరారా?

​గతంలో కేసీఆర్ (KCR) హయాంలో జిల్లా కొనుగోలు కమిటీల ద్వారా స్థానిక కాంట్రాక్టర్లకు పనులు దక్కేవని, ఇప్పుడు కేంద్రీకృత టెండర్ల పేరుతో పక్క రాష్ట్రాల వారికి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. టెండర్ ఫీజుల పేరుతో వేల రూపాయలు వసూలు చేయడంపై “ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్ నడిపిస్తున్నారా?” అంటూ నిలదీశారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లలో రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు.

ఏప్రిల్ 14 డెడ్ లైన్​

రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవో నెం 17ను హైకోర్టు (High Court) ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) లోపు ఈ “డ్రాకోనియన్” జీవోను రద్దు చేసి, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాల సాక్షిగా కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp