|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

Telangana Schools Bandh : రేపే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్.. రేవంత్ సర్కార్ కు ఏబీవీపీ అల్టిమేటం

హైదరాబాద్, సూర్య న్యూస్ :రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా జూన్ 23న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్ కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏబీవీపీ (ABVP) కూకట్ పల్లి విభాగ్ కన్వీనర్ రేగోడ్ నాగేష్ మీడియా సమావేశంలో బంద్ వివరాలను వెల్లడించారు.

రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) దాదాపు 23 వేల బడులను మూసివేసి కేవలం 4 వేలకు కుదించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ చర్యల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఉన్న సవతి తల్లి ప్రేమను బట్టబయలు చేసిందని మండిపడ్డారు.

ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైన ముఖ్యమంత్రి (CM Revanth Reddy) కార్పొరేట్ మాఫియాకు అంబాసిడర్ గా మారారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే తన తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విద్యా సంక్షోభానికి వ్యతిరేకంగా జూన్ 23న జరిగే పాఠశాలల బంద్ కు (Schools Bandh) ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తిగా సహకరించాలని నాగేష్ కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp